మూసీ సుందరీకరణకు ముందడుగు.. ప్లాన్‌ రూపొందిస్తున్న MRDCL

musi river beautification project
x

musi river beautification project

Highlights

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముంబైకి చెందిన స్ట్రక్ట్​వెల్​డిజైనర్స్​ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు.

మూసీ నది సుందరికీరణ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీ రివర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే మూసీ పరీవాహక ప్రాంతాలను సర్వే చేసిన అధికారులు తాజాగా మూసీపై నిజాం కాలంలో 58 కిలోమీటర్ల పొడవున నిర్మించిన17 బ్రిడ్జిల పటిష్టతపై పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దశాబ్ధాల కింద నిర్మించిన ఈ బ్రిడ్జిలు స్ట్రాంగ్​గా ఉన్నాయా లేవా? ఇంకా ఎంత కాలం తట్టుకుని నిలబడగలవు?

మూసీపై నిర్మించిన బ్రిడ్జిల్లో నయాపూల్​, పురాణాపూల్​, నాగోల్​, ఇమ్లిబన్, ముస్లింజంగ్​, టిప్పు ఖాన్, బాపూఘాట్, సాలార్​జంగ్, అత్తాపూర్​, చాదర్​ఘాట్​, గోల్నాక బ్రిడ్జిలను పరిశీలించనున్నారు. ఈ బ్రిడ్జిలు నిజాం కాలంలో నిర్మించినవి కావడం, చారిత్రక నేపథ్యం ఉండడంతో లోపాలు ఉంటే కూల్చడం కంటే..వారసత్వ కట్టడాలుగా భావించి రిపేర్లు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు. బ్రిడ్జిల పటిష్టత పరీక్షలు నిర్వహించేందుకు పలు కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించి ముంబైకి చెందిన స్ర్టక్ట్​వెల్​ డిజైనర్స్​ అండ్​ కన్సల్టెంట్స్​ ప్రైవేట్ ​లిమిటెడ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా బ్రిడ్జిల పటిష్టతను పరిశీలించడానికి సదరు కంపెనీ రీబౌండ్​ హ్యామర్​ టెస్ట్​, గ్రౌండ్​ పెనిట్రేటింగ్​ రాడార్​, డైనమిక్​ లోడ్​ టెస్టింగ్స్​నిర్వహించనున్నది. రెండు నెలల్లో ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనుంది.

తూర్పున గౌరెల్లి నుంచి మొదలుకుని పశ్చిమాన నార్సింగి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్​కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్లాన్లు రూపొందించారు. మూడేండ్లలో మూసీ అభివృద్ధి పనులు పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. విదేశాల్లో పలు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించిన అధికారుల బృందం మూసీ అభివృద్ధికి రూ.58 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసింది.

మూసీనది అభివృద్ధిలో భాగంగా పీపుల్స్ ప్లాజాలు, సైకిల్ ట్రాక్స్​, గ్రీన్​వేలు , హాకర్​జోన్లు, వంతెనలు, వినోద, పర్యాటక ప్రాంతాలు, క్రీడా సౌకర్యాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలు, ఆతిథ్య మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మురికికూపంగా మారిన మూసీని ఉపాధి కల్పనా జోన్​గా మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే నదికి రెండువైపులా ఉన్న భూమిని పూర్తిగా వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. నదిలో మురుగును పూర్తిగా మళ్లించడం, ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారు.

ఈ వంతెనలు మెత్తం నిజాం కాలంలో నిర్మించినవి కావడం, వాటికి చారిత్రక నేపథ్యం ఉండడంతో లోపాలు ఉంటే వాటిని పూర్తిగా కూల్చడం కంటే.. వారసత్వ కట్టడాలుగా గుర్తించి రిపేర్లు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆయా కట్టడాల్లో లోపాలు ఉంటే పక్కనే కొత్తగా బ్రిడ్జిలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండగా.. కొత్త బ్రిడ్జిలు అందుబాటులో వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories