తొలిసారిగా ప్లాస్మా ఫౌడర్‌ని తయారు చేసిన ఈఎస్ఐ వైద్యులు

The first plasma powder was made by the ESI Doctors
x

Representational Image

Highlights

* ప్లాస్మా కంటే ఎక్కువ ఉపయోగం అంటున్న డాక్టర్లు * ప్రభుత్వ అనుమతి కోసం చూస్తున్న శాస్త్రవేత్తలు * ప్లాస్మా ఫౌడర్ మూడేళ్ల పాటు నిల్వ

దేశంలోనే తొలిసారిగా కరోనా పేషెంట్స్ కోసం ప్లాస్మా ఫౌడర్‌ని తయారు చేస్తున్నారు శ్రాస్త్రవేత్తలు కరోనాను జయించిన వారి నుంచి ప్లాస్మాని సేకరించి ఫౌడర్‌ని తయారు చేస్తున్నారు. దీన్ని సెలైన్‌లో కలిపి బాడీలోకి ఎక్కిస్తారు. ప్లాస్మా కంటే దీన్ని శరీరంలోకి ఎక్కించడం వలన ఉపయోగం ఎక్కువ అంటున్నారు ఈ.ఎస్.ఐ డాక్టర్లు.

ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు టర్న్ తీసుకుని కొత్త స్ట్రెన్ తో అందరిని భయపెడుతోంది. కోవిడ్ వచ్చిన వారిలో చివరి దశకు చేరుకున్న వారిని కాపాడేందుకు ప్లాస్మా బ్లెడ్ సెల్స్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు అదే ప్లాస్మా ఫౌడర్ రూపంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ.ఎస్.ఐ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్స్.

ఇప్పటి వరకు వయసు పై బడిన వారికి కరోనా నుంచి కాపాడేందుకు ప్లాస్మా మాత్రమే ఉపయోగపడేది. కానీ, ఇప్పుడు ప్లాస్మా పౌడర్ ద్వారా చాలా ఉపయోగం ఉందని అంటున్నారు మాములుగా ప్లాస్మా ఒక ఏడాది పాటు భద్రపరచవచ్చు. కానీ, ప్లాస్మా ఫౌడర్‌ని మూడేళ్ల పాటు దాచవచ్చని వైద్యులు అంటున్నారు.

కరోనా బారిన పడిన వారి కోసం ఈ.ఎస్.ఐ వైద్యులు ఎక్కడ లేని విధంగా ప్లాస్మా ఫౌడర్‌ని ట్రయల్స్ సక్సెస్ చేశామని అంటున్నారు. ఈ ప్లాస్మా ఫౌడర్ వలన ఎలాంటి ఇబ్బందులు రావని వైద్యులు చెప్తున్నారు. ఈఎస్ఐ వైద్యులు ప్లాస్మా పౌడర్ ని తయారు చేయడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిని పూర్తి స్థాయిలో ఉపయోగించడం కోసం ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories