Telangana: తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేందుకు రంగం సిద్ధం

The field is ready to support Telangana activists
x

Telangana: తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేందుకు రంగం సిద్ధం

Highlights

Telangana: జైలుకు వెళ్లిన 1000 మంది ఉధ్యమకారులు

Telangana: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి కేసులు, జైలుపాలైన ఉద్యమకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఉద్యమకారుల సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఎత్తివేయడంతోపాటు అర్హులైన వారికి 250 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు, హెల్త్‌‌కార్డులు సహా ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది,

ఇందులో భాగంగా 2009 డిసెంబర్‌‌‌‌ 9 నుంచి 2014 జూన్‌‌ 2వ తేదీ వరకు ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను సేకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాలకు చెందిన ఎస్‌‌పీలు, సీపీలకు ఫ్యాక్స్‌‌ ద్వారా సమాచారం అందించారు. ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను తెలిపేందుకు ప్రత్యేక ఫార్మాట్ రూపొందించారు. గతంలో ఎత్తివేసిన కేసులు సహా పోలీస్‌‌ స్టేషన్‌‌, ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నంబర్, సెక్షన్స్, పూర్తి చిరునామా, అరెస్ట్, రిమాండ్‌‌ తేదీలు, 41 సీఆర్‌‌‌‌పీసీ నోటీసులు, కేసు పెండింగ్‌‌లో ఉంటే ప్రస్తుతం జరుగుతున్న కోర్టు విచారణ వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు ఈ కేసుల వివరాలను బయటికి తీస్తున్నారు.

సీఐడీలో ఐటీ సెల్‌‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులపై కేసుల డేటాను కలెక్ట్ చేస్తున్నారు. సీఐడీ సేకరించిన డేటా ఆధారంగా పెండింగ్ కేసులను గుర్తిస్తారు. గతంలో ఎత్తివేసిన కేసులతో పాటు కోర్టు విచారణలో ఉన్న కేసులను సంబంధిత అధికారులు పర్యవేక్షించనున్నారు. కేసులను ఎత్తివేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్టుగా స్కీమ్‌‌లకు అర్హులైన ఉద్యమకారులను ఎంపిక చేయనున్నారు.

తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన పోలీస్ కేసులు 3,000కుపైగా ఉండగా, జైలుకు వెళ్లినవారు 1,000 మంది వరకూ ఉండొచ్చని చెప్తున్నారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ సర్కార్ పాలనలో ఏనాడూ కేసులు, జైలుపాలైన తెలంగాణ ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేసే పనికి పూనుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ హర్షం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories