రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్

The Exhibition Will Be Started Tomorrow By The Hands Of CM Revanth Reddy
x

రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్

Highlights

Revanth Reddy: జనవరి 1నుంచి ఫిబ్రవరి 2వ వారం ఎగ్జిబిషన్

Revanth Reddy: హైదరాబాద్ మహానగరంతో, నుమాయిష్‌ది విడదీయరాని బంధం. 8దశాబ్దాలుగా ప్రతి యేటా ఇక్కడ ప్రజలను పలకరిస్తు..సరికొత్త అనుభూతులను మిగుల్చుతోంది. వివిధ ప్రాంతాలకు చెందిన కళాత్మక వస్తువులను, పిండి వంటలను గ్రేటర్ వాసులకు పరిచయం చేస్తూ వస్తోంది. నుమాయిష్‌ కోసం పట్టణ వాసులు ఎదురు చూసేంతగా ప్రజలతో మమేకం అయ్యింది ఈ ఎగ్జిబిషన్. నుమాయిష్ వచ్చేసిదంటే చాలు.. ఫ్యామిలీతో వెళ్లి.. నచ్చిన వస్తువులను కొనుక్కొని.. నచ్చిన పిండి వంటలను టేస్ట్ చేసి.. కాసేపు పిల్లలతో కలిసి గేమ్స్‌లో పాటిస్పెట్‌ చేసి వస్తుంటారు వినియోగదారులు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నుమాయిష్ వచ్చిదంటే హైదరాబాద్‌కు ప్రయాణం కడతారు.

న్యూ ఇయర్ సందడితో పాటు నుమాయిష్ కొలువుదీరండంతో హైదరాబాద్ వాసుల సందడి మరింత రెట్టింపు అయింది. 46 రోజుల పాటు ప్రేక్షకులను అలరించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ ముస్తాబైంది. ఈసారి 2400 స్టాల్లు కొలువుదీరాయి. ఫుల్ సెక్యూరిటీతో నిర్వహించేందుకు ఎగ్జిబిషన్‌ సొసైటీ ఏర్పాట్లు చేసింది. సరికొత్త డ్రెస్సింగ్ కలెక్షన్స్, ఇంటీరియల్ డిజైన్స్, ఫుట్ ఐటమ్స్‌తో ఎగ్జిబిషన్ రెడీ అయ్యింది. ప్రతి ఏట లాగే.. ఈసారి కూడా కస్టమర్స్‌ను ఆకట్టుకునేలా ముస్తాబైంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా.. ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. దేశంలోని వివిధ రాష్ర్టాల ఉత్పత్తులను ప్రదర్శనలో ప్రదర్శించడంతో పాటు అమ్మకాలు జోరుగా సాగుతాయి.

మొత్తం 2400 స్టాళ్లు ఇక్కడికి వచ్చేవారిని అలరించనున్నాయి. సాధారణ రోజుల్లో మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 10:30 వరకు, వారాంతరాల్లో రాత్రి 11 వరకు నుమయిష్ అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ టికెట్ 40 రూపాయలుగా నిర్ధారించారు.. ఉచిత పార్కింగ్ ని ఈ ఏడాది కూడా కేటాయిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు.. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు, చర్యలు తీసుకున్నారు.

దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ గా ఇక్కడ పేరుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయి. చౌక ధరలకు దొరుకుతుండటంతో ప్రతి ఏటా జరిగే ఎగ్జిబిషన్ లో వస్తువులను కొనుగోలు చేయాలని నగరవాసులు వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికి 82 సార్లు ఎగ్జిబిషన్ నిర్వహించారంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఖరీదైన వస్తువుల నుంచి అతి స్వల్పమైన ధరలకు లభించే వస్తువులు ఇక్కడ దొరుకుతుండటంతో పేద, ధనిక తేడా లేకుండా ఎగ్జిబిషన్ కు క్యూ కడుతుంటారు. ఇక సెలవు దినాల్లో చెప్పాల్సిన పనిలేదు. మనిషి నడవాలంటే కూడా కష్టమే అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories