Election Commission: ఆల్‌పార్టీ మీటింగ్ నిర్వహించిన ఈసీ

The Election Commission Arranged A Meeting With All The Parties
x

Election Commission: ఆల్‌పార్టీ మీటింగ్ నిర్వహించిన ఈసీ

Highlights

Election Commission:

Election Commission: షెడ్యూల్ విడుదలైన తరువాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది ఈసీ. ఈ సమావేశానికి హాజరైన పొలిటికల్ పార్టీలకు ఎన్నికల నిర్వహణ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు వికాస్ రాజ్. అనంతరం ఆయా పార్టీల ఫిర్యాదు స్వీకరించారు.

ఎన్నికల నగారా మోగిన తరువాత తెలంగాణ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. దాదాపు నాలుగు గంటలపాటు సుధీర్గంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పొలిటికల్ పార్టీలకు సీఈఓ వికాస్ రాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సూచనలు చేసింది ఈసీ.

ఇక ఈసీ PPT అవ్వగానే సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీలు తమ తమ అభిప్రాయాలను, ఫిర్యాధులను ఈసీకి ఇచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్‎, BRS సభ్యుల మధ్య ఈసీ సమావేశంలోనే మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి అధికారిక భవనంలో పార్టీ బి -ఫామ్స్ ఎలా పంపిణీ చేస్తారని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. కాంగ్రెస్ అడిగిన వెంటనే బేస్ లెస్ వ్యాఖ్యలంటూ BRS ప్రతినిధులు కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రగతి భవన్ లో బి ఫామ్స్ పంపిణి పై ఇప్పటికే విచారణకు అదేశించినట్టు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.

ఇక లిక్కర్ బ్యాన్ చేయాలనీ ఆప్ పార్టీ కోరగా, బ్యాలెట్ ఓటింగ్ పెట్టి ఎలక్షన్ నిర్వహించాలని KA పాల్ ప్రజాశాంతి ప్రతినిది కోరారు. అదే విధంగా బోగస్ ఓట్ల పై ఈసీ ఇప్పటికీ క్లారిటి ఇవ్వలేదని ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కొరింది సీపీఎం.పొలిటికల్ పార్టీలకు దిశానిర్దేశం చేసిన ఈసీ. ఆయా పార్టీల ఫిర్యాదులపై అన్నింటికీ సమాధానం చెబుతామని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories