Telangana: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యఓట్ల తేడా 2.05శాతమే

The Difference in Votes Between BRS and Congress is only 2.05 Percent
x

Telangana: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యఓట్ల తేడా 2.05శాతమే

Highlights

Telangana: బీఆర్ఎస్‌కు 37.35శాతం ఓట్లు.. కాంగ్రెస్‌కు 39.40శాతం ఓట్లు

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. అయినా కాంగ్రెస్ మాత్రం ఎక్కువ సీట్లలో విజయం సాధించింది. 119 స్థానాల్లో హోరాహోరీ పోటీ జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్‌ కంటే కేవలం 2.05శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఈసారి బీఆర్ఎస్‌కు 37.35శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 39.40శాతం ఓట్లు వచ్చాయి.

రాష్ట్రంలో 3కోట్ల 26లక్షల 2వేల 799 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌కు 91లక్షల 86వేల 837, బీఆర్ఎస్‌కు 87లక్షల 14వేల 040, బీజేపీకి 32లక్షల 35వేల 583 ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు 5లక్సల 15వేల 809, ఆల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌కు 1లక్ష 46వేల 079, బీఎస్పీకి 3లక్షల 20వేల 554, సీపీఐకి 80వేల 336, సీపీఎంకు 51, 828, ఇతరులకు 8లక్షల 98వేల 010 , నోటాకు 1లక్ష 70వేల 956 ఓట్లు పడ్డాయి.

బీఆర్ఎస్‌ కంటే కాంగ్రెస్‌కు 2.05శాతం ఓట్లు మాత్రమే అధికంగా వచ్చినా 64సీట్లు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్‌ 37.35శాతం ఓట్లతో కేవలం 39సీట్లు గెలుచుకుంది. అయితే కాంగ్రెస్‌కు 2018 కంటే ఈసారి 10.97శాతం ఓటింగ్ పెరగగా... బీఆర్ఎస్‌కు 46.87శాతం ఓట్లు పోలవ్వగా... ఏకంగా 88సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ మాత్రం 28.43శాతం ఓటింగ్‌తో 19సీట్లకు పరిమితమైంది.

ఇక ఉత్తర తెలంగాణలో మొత్తం 44 సీట్లలో 2018లో బీఆర్ఎస్ 38 సీట్లు గెలవగా... 2023లో 11 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్‌ 2018లో 4 సీట్లు గెలవగా... 2023లో 26 సీట్లు కైవసం చేసుకుంది. దక్షిణ తెలంగాణలో మొత్తం 46 సీట్లలో బీఆర్ఎస్ 2018లో 32 సీట్లు గెలవగా... 2023లో 11 సీట్లు మాత్రమే గెలిచింది. ఇక కాంగ్రెస్ 2018లో 11 సీట్లు గెలవగా.... 2023లో 34 సీట్లు కైవసం చేసుకుంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 29సీట్లు ఉండగా... బీఆర్ఎస్ 2018లో 18 సీట్లలో గెలవగా... 2023లో 17 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 2018లో 3 స్థానాల్లో గెలుపొందగా... 2023లో 4 సీట్లు గెలుపొందింది. ఎంఐఎం 2018లో 7 సీట్లు గెలవగా... 2023లో 7 సీట్లలో గెలుపొందింది.

Show Full Article
Print Article
Next Story
More Stories