Telangana: రాష్ట్రంలో 58, 59 జీవో దరఖాస్తులకు నేటితో గడువు ముగింపు

The Deadline for 58, 59 JO Applications in the Telangana State is Today
x

Telangana: రాష్ట్రంలో 58, 59 జీవో దరఖాస్తులకు నేటితో గడువు ముగింపు

Highlights

Telangana: ఇప్పటివరుక జీవో 58 కింద 87,520 దరఖాస్తులు

Telangana: రాష్ట్రంలోని జిల్లాలో 58, 59 జీవో ప్రకారం స్థలాల రెగ్యులరైజేషన్‌ కోసం కొనసాగుతున్న ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టితో ముగియనున్నది. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం గతంలో సూచించింది. ఇదే చివరి అవకాశమని, లబ్ధిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి వరకు జీవో 58 క్రింద 87వేల 520 దారకాస్తులు రాగా, జీవో 59 కింద 59వేల 748 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా లక్ష 47వేల 268 అందాయి. ఇవాళ్టి వరకు సమయం ఉంది కాబట్టి ఇంకా ఎన్ని దరఖాస్తులు రానున్నాయో వేచి చూడాలి.

రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసం ఏర్పాటు చేసుకున్న స్థలాలను క్రమబద్ధీకరించనుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014 డిసెంబర్ 30న రెండు జీఓలను విడుదల చేసింది. అందులో జీవో 58 ప్రకారం 125 చదరపు గజాల్లోపు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి, జిఓ 59 ప్రకారం మధ్య తరగతి ఆపై తరగతికి చెందిన ప్రజలు నిర్మించుకున్న ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా ప్రభుత్వం ధరలను ఖరారు చేసింది. ఇలా 2014, 15, 17 సంవత్సరంలో ఫ్రిబవరిలో ఒకసారి, డిసెంబర్‌లో మరోసారి పేదలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 11.19 లక్షల దరఖాస్తులు రాగా, ఉచితంగా 6.18 లక్షల మంది దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించింది. మిగతా వాటికి వాటి విస్తీర్ణం ఆధారంగా ధర నిర్ణయించి క్రమబద్ధీకరించింది. వీటి పరిష్కారానికి ఆర్డీఓ నేతృత్వంలోని తహసీల్దార్‌లతో కూడిన కమిటీలను ప్రభుత్వం నియమించడంతో పాటు వాటి పరిష్కారానికి 90 రోజుల సమయాన్ని ఇచ్చింది. ఇక నేటితో ఈ గడువు ముగియనుందని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories