Palamooru: పాత, కొత్త హస్తం నేతల మధ్య కోల్డ్ వార్

The Cold War Between Old And New Leaders In Congress Party
x

 Palamooru: పాత, కొత్త హస్తం నేతల మధ్య కోల్డ్ వార్

Highlights

Palamooru: జూపల్లి తీరుపై మండిపడుతున్న పాత కాంగ్రెస్ లీడర్లు

Palamooru: పాలమూరు కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. టికెట్ల కేంద్రంగా.. పాత, కొత్త నేతల ప్రచారాలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. మాజీ మంత్రి జూపల్లి తీరుపై పాత కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారట. కొల్లాపూర్, అచ్చంపేటల్లో తన వర్గీయలకే సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం వద్ద జూపల్లి హామీ తీసుకున్నట్లు చర్చ జరుగుతున్న నేపథ్యంలో..ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్న తమ పరిస్థితి ఏంటని సీనియర్ నేతలు మదనపడుతున్నారట.

మరోవైపు కొల్లాపూర్‌లో జూపల్లికి వ్యతిరేకంగా జగదీశ్వర్‌రావు పావులు కదుపుతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే నాగర్ కర్నూల్ నుంచి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది.అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడాన్ని నాగం వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోందట. దీంతో కొత్త, పాత నేతల టికెట్ల పంచాయితీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది.. అయితే కొత్త వారికైనా, పాతవారికైనా సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని అధిష్టానం క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పంచాయితీకి తెరపడుతుందా లేదా అనేది వేచిచూడాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories