Telangana: తెలంగాణ అప్పుల వివరాలు వెల్లడించిన కేంద్రం.. ఎన్ని లక్షల కోట్లంటే?

The Center Revealed the Details of Telangana Debts
x

Telangana: తెలంగాణ అప్పుల వివరాలు వెల్లడించిన కేంద్రం.. ఎన్ని లక్షల కోట్లంటే?

Highlights

Telangana: రాత పూర్వక సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ

Telangana: తెలంగాణ రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఆర్థిక శాఖ రాతపూర్వక సమాధానమిచ్చింది. 2014లో రాష్ట్రం ఏర్పడే సమయానికి 75 వేల 577 కోట్ల రూపాయలు అప్పు ఉండగా... ప్రస్తుత అప్పు 2 లక్షల 83 వేల 452 కోట్లకు చేరిందని తెలిపింది. ప్రభుత్వం చేస్తున్న అప్పులే కాక ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల నుంచి అదనంగా వేల కోట్లు రూపాయలను తెలంగాణా రాష్ర్ట కార్పొరేషన్లు, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నాబార్డ్ నుంచి... తెలంగాణా ప్రభుత్వంకు ఇప్పటివరకు 7 వేల144 కోట్ల రుణాలు తీసుకున్నట్లు వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories