Secunderabad muthyalamma:ముత్యాలమ్మ విగ్రహం ఘటనపై కేంద్రం సీరియస్..రంగంలోకి అమిత్ షా..నగరానికి కేంద్ర బలగాలు

Secunderabad muthyalamma:ముత్యాలమ్మ విగ్రహం ఘటనపై కేంద్రం సీరియస్..రంగంలోకి అమిత్ షా..నగరానికి కేంద్ర బలగాలు
x
Highlights

Secunderabad muthyalamma: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఘటన తెలంగాణలో పెనుదుమారం రేపుతోంది. ఈ ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

Secunderabad muthyalamma: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఘటన తెలంగాణలో పెనుదుమారం రేపుతోంది. ఈ ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్లో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలోకి వెళ్లినో ఓ వర్గానికి చెందిన వ్యక్తి అమ్మవారిని కాలితో తన్నుతూ ధ్వంసం చేసిన ఘటన ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. హిందు సంఘాలంతా దీనిపై మండిపడుతున్నాయి. అంతేకాదు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు.

అంతేకాదు ఎక్కడ కూడా శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తదితరులు ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. ముఖ్యంగా రాజాసింగ్ ను ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ ఘటనపై కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

ఈమధ్య కాలంలో హిందూ ఆలయాలు, హిందువులను టార్గెట్ చేసిన కొంతమంది రెచ్చిపోతున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఓవైపు లవ్ జీహాద్, మరోవైపు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దాడులు చేస్తున్నారంటూ హిందూ సమాజం ఫైర్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories