Telangana: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు.. తెలంగాణ వ్యాప్తంగా కోటి పచ్చని మొక్కలు నాటాలని లక్ష్యం

The Aim Is To Plant One Crore Green Saplings Across Telangana
x

Telangana: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు.. తెలంగాణ వ్యాప్తంగా కోటి పచ్చని మొక్కలు నాటాలని లక్ష్యం

Highlights

Telangana: జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ‎శాంతి కుమారి సమీక్ష

Telangana: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా చేపడుతున్న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈనెల 26న చేపట్టనుంది ప్రభుత్వం.. ఆగస్టు 26న రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంఘాలు, సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయనున్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవాల ముగింపు సందర‌్భంగా తెలంగాణ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని జయప్రదంచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్రంలో తెలంగాణాకు హరితహారం క్రింద నిర్థారించిన లక్ష్యాన్ని, దశాబ్ది సంపద వనాల క్రింద నిర్దారిత లక్ష్యాలను పూర్తిచేయన్నారు..జూనియర్ పంచాయితీ కార్యదర్శుల క్రమబద్దీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories