Police Horse Riding: సర్ధార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో గుర్రపు పోటీలు

42nd All India Police Equestrian Championship Starts From Dec 26 At Svpnpa
x

Police Horse Riding: సర్ధార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో గుర్రపు పోటీలు

Highlights

Police Horse Riding: మరో జాతీయ స్థాయి పోటీలకు వేదికైన హైదరాబాద్.. ఉత్సాహంగా సాగుతున్న పోలీసుల గుర్రపు స్వారీలు

Police Horse Riding: గ్రేటర్ హైదరాబాద్ మరో జాతీయ స్థాయి పోటీలకు వేదికైంది. నేషనల్ పోలీస్ హార్స్ రైడింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఉత్సాహంగా సాగుతున్న ఈ పోటీల్లో పోలీసులు గుర్రపు స్వారీ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 5వరకు సర్ధార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో ఈ గుర్రపు పోటీలు జరగనున్నాయి.

హార్స్ రైడింగ్ పోటీల్లో మొత్తం 22 గుర్రపు స్వారీ జట్లు, 610మంది పోలీసు క్రీడాకారులు, 340 అశ్వాలు పాల్గొంటున్నాయి. పలు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, కేంద్ర పోలీసు సంస్థల క్రీడాకారులు హార్స్ రైడింగ్‌తో అలరిస్తున్నారు. గుర్రపు స్వారీలతో పోలీస్ అకాడమీ ఆహ్లాదంగా మారింది. ఏమి జరుగుతుందా అని అభిమానులు ఉత్సాహ భరితంగా వేచి చూస్తున్నారు. రకరకాల ప్రాంతాల నుండి వచ్చిన అశ్వాలు, వాటి నైపుణ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.

ఒక్కపుడు గుర్రాలకు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. గుర్రాలను పోలీస్ ఫోర్స్ లో గౌరవప్రదంగా చూపించడానికి మాత్రమే పెట్టేవారు. కానీ గుర్రాలతో డ్యూటీ చేయడం, వాటితో పాటు కలిసి తిరగడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు పోలీసులు. పోలీస్ డ్యూటీలో అశ్వలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని ఇటీవల తాము ఎదురుకున్న ఒడిదుడుకులతో అర్ధం అయింది అంటున్నారు పోటీల్లో పాల్గొంటున్న పోలీసులు. మరి ఈ ఈవెంట్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories