TG SSC: పదో తరగతి మార్కుల విధానంపై రేవంత్ ప్రభుత్వం యూటర్న్..ఈసారికి పాత విధానంలో టెన్త్ ఎగ్జామ్స్

TG SSC: పదో తరగతి మార్కుల విధానంపై రేవంత్ ప్రభుత్వం యూటర్న్..ఈసారికి పాత విధానంలో టెన్త్ ఎగ్జామ్స్
x
Highlights

TG SSC: తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేస్తూ గురువారం తీసుకున్న...

TG SSC: తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేస్తూ గురువారం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉన్నట్లుండి వెనక్కు తీసుకుంది. విద్యారంగ నిపుణులు నుంచి వచ్చిన విజ్నప్తులతో ఇంటర్నల్ పరీక్షలను రద్దు నిర్ణయాన్ని సర్కార్ ఉపసంహరించుకుంది. ఈ కొత్త విధానాన్ని ఈ ఏడాదికి నిలిపివేస్తూ..వచ్చే విద్య సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురువారం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒక్కో సబ్జెక్టుకు మొత్తం 100 మార్కులకు గాను వార్షిక పరీక్షలకు 80 మార్కులు కేటాయించింది. ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కులుగా కేటాయించారు. కాగా ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్నల్ పరీక్షలకు మార్కుల విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది.

ఇక నుంచి 6 సబ్జెక్టుల పరీక్షలకు 600 మార్కులు ఉంటాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ వెంటనే పాఠశాల విద్యాశాఖకు కూడా ఆదేశాలు పంపించింది. వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచే ఈ మార్పలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.

కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి కీలక నిర్ణయాలను విద్యా సంవత్సరం మొదట్లోనే ప్రకటించినట్లయితే అందుకు అనుగుణంగా విద్యార్ధులు అన్ని రకాలుగా సిద్ధం అవుతారని కానీ పరీక్షలకు కేవలం 4 నెలల ఉందనగా వెల్లడించడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని అన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.

అయితే ఈ కొత్త విధానంపై పాఠశాల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఏకంగా 3 నెలల 10 రోజులకు దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 80 మార్కులకు సమ్మెటివ్ అసెస్ మెంట్ పరీక్షలు పూర్తివ్వడంతో ఇప్పుడు ఈ విధానాన్ని ప్రకటించడం ఎంత మాత్రం సరైన నిర్ణయం కాదని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. వారి నుంచి వచ్చిన విజ్నప్తుల మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని సమాచారం. గురువారం ప్రకటించిన తన నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే ఈ కొత్త విధానాన్ని వచ్చే సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories