Kurnool: కర్నూలు జిల్లాలో ఉగ్ర ఛాయలు.. ఇద్దరు అనుమానితులను విచారించిన ఎన్ఐఏ

Terrorist Activities In Kurnool District
x

Kurnool: కర్నూలు జిల్లాలో ఉగ్ర ఛాయలు.. ఇద్దరు అనుమానితులను విచారించిన ఎన్ఐఏ

Highlights

Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లాపై ఎన్ఐఏ నిఘా

Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యాత్మికతకు పెట్టింది పేరు. అనేక పుణ్య క్షేత్రాలు ఇక్కడ వున్నాయి. భక్తుల రాకతో ఎప్పుడు సందడిగా ఉంటుంది. అయితే, ఈ అధ్యాత్మిక జిల్లాల్లో ఉగ్ర విషనాగులు చేరాయా. నెమ్మదిగా పుట్టలు పెట్టి కుట్రలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయా.? అందుకే ఎన్ ఐ ఏ అధికారులు ఉమ్మడి కర్నూలు జిల్లా పై నిఘా పెట్టారా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు అనేకం వ్యక్తమవుతున్నాయి.

ఉగ్రవాదం ఈ మాట వింటేనే గుండెల్లో గుబులు పుడుతుంది..ముంబై మారణకాండ, హైదరాబాద్ లో జంట పేలుళ్ళు, దిల్‌శుక్ నగర్ లో ఉగ్రవాదుల దాడి వంటివి మాయని గాయాలుగానే వున్నాయి. ఇక దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగు చూసినా వాటి మూలాలు హైదరాబాద్‌లో తేలుతూనే వున్నాయి. ఇక హైదరాబాద్ కు అత్యంత సమీపంలో వున్నా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఉగ్రవాదుల డెన్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాపై ఎన్ ఐ ఏ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల లింక్ లు ఇక్కడ కూడా వుండే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గత కొద్ధి రోజుల క్రితం NIA అధికారులు కర్నూలు జిల్లాకు వచ్చారు. ఇద్దరు అనుమానితులను ప్రశ్నించారు. దింతో ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు ఉలిక్కి పడ్డారు.

కర్నూలు వేదికగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఇక్కడ చురుకుగా పని చేస్తున్నట్టునిఘా వర్గాల అనుమానం. కరీంనగర్ జిల్లాకు చెందిన బబ్ రేజ్ అనే వ్యక్తి ప్రస్తుతం దుబాయ్ లో వున్నాడు. అతడి ద్వారా PFI కార్యకలాపాలు సాగుతున్నట్టు ఎన్ ఐ ఏ నిఘా వర్గాలు పసి గట్టాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు అనుమానితులను గత నెల పదవ తేదీన ఎన్ ఐ ఏ నిఘా వర్గాలు విచారించాయి..

Show Full Article
Print Article
Next Story
More Stories