TS Congress: టీ కాంగ్రెస్‌లో టెన్షన్..!

Tension In Telangana Congress
x

TS Congress: టీ కాంగ్రెస్‌లో టెన్షన్..!

Highlights

TS Congress: ఆచి తూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం

TS Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీలో అధిష్టానం చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీలో టికెట్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నందున్న ఆశావహులు ఢిల్లీలోనే మకాం వేశారు. తమకే టికెట్లు వస్తాయని హస్తం పార్టీ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకంటే కాంగ్రెస్‌కు అత్యంత కీలకం కానున్నాయి. అందుకోసం పార్టీ అధిష్టానం ఆచి తూచి వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉండగా మంచిరోజుల కోసం టీ పీసీసీ ఎదురు చూస్తోంది.. ఈనెల 14వ తేదీ తరువాత టికెట్ల ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అయితే టికెట్ల కేటాయింపుల్లో బీసీ నేతల డిమాండ్‌తో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోందని తెలుస్తోంది. బీసీలకు టికెట్లు ఇవ్వాల్సిన సెగ్మెంట్లపై హస్తం పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. బీసీ కోటా కోసం హడావుడిగా టిక్కెట్లు కేటాయిస్తే బీఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చి ఈజీగా గెలుస్తుందని హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

అందువల్ల రేపు జరిగే పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొని అధిష్టానానికి పంపించాలని భావిస్తున్నారు పార్టీ నేతలు.. బస్సు యాత్ర తేదీలు ఖరారు చేయడంతోపాటు... అభ్యర్థుల ఎంపికలో సీనియర్లందరి ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ... మొదటి లిస్టు ప్రకటన తరువాత గొడవలు లేకుంటే... ఇక పార్టీలో వివాదాలు లేవనే ప్రచారం చేసుకోవడానికి హస్తం పార్టీ ప్రయత్నం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories