Sunil Kanugolu: 2023 ఎన్నికల్లో జెండా ఎగురవేయాలంటే.. సునీల్ కనుగోలు తాజా నివేదికతో కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్

Tension Among Congress Leaders With The Latest Report Of Sunil Discovery
x

Sunil Kanugolu: 2023 ఎన్నికల్లో జెండా ఎగురవేయాలంటే.. సునీల్ కనుగోలు తాజా నివేదికతో కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్

Highlights

Sunil Kanugolu: ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా పోటీ ఇచ్చే పరిస్థితి లేదని రిపోర్ట్

Sunil Kanugolu: సునీల్ కనుగోలు తాజా నివేదికతో కాంగ్రెస్‌ నేతల్లో కొత్త టెన్షన్ నెలకొంది. 2023 ఎన్నికల్లో జెండా ఎగురవేయాలంటే... ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉండాలని.. 5 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా... పోటీ ఇచ్చే పరిస్థితి లేదని సునీల్ షాకింగ్ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నేతలు పనులు మానేసి... గ్రూప్‌ రాజకీయాలకే సమయం కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బలహీనంగా ఉందంటూ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

5 పార్లమెంట్ పరిధిలో 35 అసెంబ్లీ స్థానాల్లో.. ఇక్కడ పార్టీ బలపడాలంటే స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలని రిపోర్ట్‌‌లో పేర్కొన్నాడు. A కేటగిరిలో 35 గెలిచే స్థానాలు, B కేటగిరిలో కొంచెం కష్టపడితే గెలిచేవి 30 స్థానాలు... C కేటగిరిలో 19 స్థానాలు క్యాడర్ బలంగా ఉన్న బలమైన నాయకుడు లేకపోవడం ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీలో చేరిస్తే గెలిచే స్థానాలంటూ రిపోర్ట్ ఇచ్చాడు. ఇక మిగిలిన స్థానాలు ఆ5 పార్లమెంట్ పరిధిలో పార్టీ చాలా బలహీనంగా ఉందని తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories