Telangana Weather Report: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు

Temperatures in Telangana Will Rise Further Today and Tomorrow
x

Telangana Weather Report: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు

Highlights

Telangana Weather Report: ఇవాళ, రేపు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

Telangana Weather Report: రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు విస్తునందున పాఠశాలల్లో సమయాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు సీఎస్ సోమేశ్ కుమార్. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవలని అన్ని జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు.

రెండురోజుల్లో ఉత్తర తెలంగాణా జిల్లాలతోపాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో రెండు నుండి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని ఆసుపత్రుల్లో వైదులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు సీఎస్. అదేవిధంగా సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని కోరారు. ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య ప్రర్చాలని కలెక్టర్ లను హెచ్చరించారు.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండల తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్‌ను మార్చింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలను పరిశీలించాక స్కూల్‌ టైమింగ్స్‌ మార్చాలని నిర్ణయించారు. పలు చోట్ల వడగాలులు వీస్తున్నందున ఇవాళ్టి నుంచి ఉదయం 8 గంటల నుంచి 11గంటల 30 నిమిషాల వరకు మాత్రమే పనిచేస్తాయి. కొత్త టైమింగ్స్‌ ఏప్రిల్‌ 6 వరకు అమల్లో ఉంటాయని తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories