TG Weather Updates: 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rains Updates In Telugu States imd alert in telugu states heavy rains in ap for the next three days
x

Weather Update: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్..వచ్చే మూడు రోజులు వానలే వానలు

Highlights

TG Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆగస్టు 21వ తేదీ వరకు వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

TG Weather Updates: వాయువ్య బంగాళాఖాతం మీదుగా బంగ్లాదేశ్ కు ఆనుకోని ఉన్న ప్రాంతాల మీదుగా అల్పపీడనం కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది. కొంకణ్ నుంచి ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు ద్రోణి ఉన్నట్లు తెలిపింది. దక్షిణ, ఉత్తర అంతర్బాగ కర్నాటక పొరుగు ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా వ్యాపించి..సముద్ర మట్టానికి 1.5కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉన్నట్లు తెలిపింది.

ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆగస్టు 21వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.

అటు ఏపీలో నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,బాపట్ల, ప్రకాశం,నెల్లూరు,వైయస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

హైదరాబాద్ నగరంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, నిజాంపేట్‌, ప్రగతి నగర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్, ఖైరతాబాద్, చందానగర్, మియాపూర్, సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో..వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories