Telugu States Debt Collecting Details: అప్పులు తీసుకోవడంలో పోటీపడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు..

Telugu States Debt Collecting Details: అప్పులు తీసుకోవడంలో పోటీపడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు..
x
File Photo
Highlights

Telugu States: అప్పులు తీసుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి..

Telugu States Debt Collecting Details: అప్పులు తీసుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి.. ఇందులో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండగా ఆరో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది.. గతేడాదితో పోలిస్తే తెలంగాణలో అప్పుల భారం 38 శాతం పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో 42 శాతం పెరిగింది. తాజాగా వీటికి సంబంధించిన వివరాలను సోమవారం రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్రం 2018-19లో బహిరంగ మార్కెట్‌ నుంచి స్థూలంగా రూ.26,740 కోట్లు, నికరంగా రూ.22,183 కోట్ల రుణం సేకరించింది.

ఇక 2019-20 కల్లా స్థూల రుణం రూ.37,109 కోట్లు, నికరరుణం రూ.30,697 కోట్లకు చేరింది. గత ఏడాది దేశంలో బహిరంగమార్కెట్‌ నుంచి అత్యధిక రుణం సేకరించిన 9వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇక 2020-21 సంవత్సరంలో ఏప్రిల్‌, మేనెలల్లో తెలంగాణ రాష్ట్రం స్థూలంగా రూ.8వేల కోట్లు, నికరంగా రూ.6,750 కోట్ల మేర సేకరించింది. ఈ విషయంలో రాష్ట్రం 6వ స్థానంలో నిలిచింది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి..2018-19తో పోలిస్తే 2019-20లో బహిరంగ మార్కెట్‌ నుంచి ఏపీ ప్రభుత్వం సేకరించిన స్థూల రుణం 42.10%, నికర రుణం 42.47%మేర పెరిగింది. 2020-21 మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నెలకు సగటున రూ.3,333 కోట్ల చొప్పున రూ.10వేల కోట్ల స్థూల రుణం తీసుకుంది. ఇందులో నికర రుణ వాటా రూ.8,250 కోట్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇక గత ఏడాది అత్యధిక రుణాలు తీసుకున్న రాష్ట్రంగా ఆరోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2020-21లో ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం మూడో స్థానంలో నిలిచింది.





Show Full Article
Print Article
Next Story
More Stories