Jani Master Controversy : లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్ కు తెలుగు ఫిలిం ఛాంబర్ షాక్

Telugu Film Chamber Shocked by Johnny Masters Sexual Harassment Case
x

Jani Master Controversy : లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్ కు తెలుగు ఫిలిం ఛాంబర్ షాక్

Highlights

Jani Master Controversy : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసుల నమోదు చేశారు. అయితే టాలీవుడ్ లో లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్ ను తాత్కాలికంగా తప్పించాలని కమిటీ సిఫార్సు చేసింది.

Jani Master Controversy : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసుల నమోదు చేశారు. అయితే టాలీవుడ్ లో లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్ ను తాత్కాలికంగా తప్పించాలని కమిటీ సిఫార్సు చేసింది. పని ప్రదేశాల్లో మహిళలకు చలన చిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేకపోతుందంటూ ఆవేదన వ్యక్తంచేసింది. చిత్ర పరిశ్రమలో మహిళలు వేధింపులకు గురయితే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని..వారి వివరాలను గోప్యంగా ఉంచుతామంటూ స్పష్టం చేసింది.

హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమైన ఆ కమిటీ కన్వీనర్ దామోదర ప్రసాద్, చైర్ పర్సన్ ఝాన్సీ, సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజ, వివేక్ కూచిబొట్ల, ప్రగతి, సామాజిక కార్యకర్త రామలక్ష్మీ, న్యాయవాది కావ్య మండవలు పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. అవకాశాలు పోతాయని చాలా మంది అమ్మాయిలు తమకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారని అన్నారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు సంబంధించి బాధిత యువతి ముందే తమ కమిటీని ఆశ్రయించినట్లు వెల్లడించారు.

టాలెంట్ ఉన్న అమ్మాయిలకు పరిశ్రమలో ఎప్పుడూ అవకాశాలు ఉంటన్నాయన్నారు ఝాన్సీ. ఈ విషయంలో బాధిత యువతికి ఓ పెద్ద నిర్మాణ సంస్థ, ఓ అగ్ర నటుడు ఛాన్స్ ఇచ్చారని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో గతంలో నియమించిన కమిటీ రిపోర్టు..బయటకు వస్తే పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకునేందుకు అవకాశం ఉంటుందని ఝాన్సీ తెలిపారు.

గతంలో పరిశ్రమలు లైంగిక వేధింపుల కేసులు చాలా నమోదు అయ్యాయని..కొన్ని తమ దృష్టి రావడం లేదని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. తమ కమిటీ ద్రుష్టికి వచ్చిన వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ తమ వంత బాధ్యతగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలకు పరిశ్రమ భరోసా ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి అఘాత్యాలకు పాల్పడుతున్నారని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories