Telangana thalli statue: తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై వివాదం ఏంటి?

Telangana thalli statue: తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై వివాదం ఏంటి?
x
Highlights

Telangana thalli statue: తెలంగాణ తల్లి కొత్త విగ్రహావిష్కరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 9న ఈ విగ్రహాన్ని తెలంగాణ...

Telangana thalli statue: తెలంగాణ తల్లి కొత్త విగ్రహావిష్కరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 9న ఈ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ఆవరణలో ఆవిష్కరిస్తారు.తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు.వాస్తవ తెలంగాణ ప్రజలకు ప్రతిరూపంగా విగ్రహాన్ని రూపొందించామని ప్రభుత్వం చెబుతోంది. నాలుగేళ్ల తర్వాత ఏ విగ్రహాం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ విమర్శలకు కాంగ్రెస్ గట్టిగానే కౌంటరిచ్చింది.

అసలు వివాదం ఏంటి?

రాచరికపు హావభావాలకు భిన్నంగా తెలంగాణ బహు జనుల ప్రతి రూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4న జరిగిన తెలంగాణ తల్లి కొత్త విగ్రహాం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. .ఈ విగ్రహం రూపకల్పన చేసేందుకు ముందుగా రాజకీయ పార్టీలు, మేధావులతో చర్చించినట్టుగా విగ్రహం తయారీలో అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోరాట స్పూర్తిని తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా అందిన సూచనల మేరకు తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయించారు. డిసెంబర్ 6న ఈ విగ్రహా నమూనాను ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ఉన్న విగ్రహానికి తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన విగ్రహానికి మధ్య స్పష్టమైన మార్పులున్నాయి.

తెలంగాణ ఆడబిడ్డల కట్టుబొట్టు ఉట్టిపడేలా విగ్రహాం రూపొందించారు. ఆకుపచ్చని రంగు పచ్చని పంట పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ లాంటి ధీరవనితలను ప్రతిబింబిస్తాయంటున్నారు.కొత్త విగ్రహాంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. విగ్రహాం రూపుమార్చడంపై రేవంత్ రెడ్డి ఎవరితో చర్చించారని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాం చేశారా? కాంగ్రెస్ తల్లి విగ్రహాం చేశారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ తల్లి విగ్రహహం ఏర్పాటు వెనుక

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉద్యమ ప్రతీకగా ముందుకు తేవాలనేది కేసీఆర్ ఆలోచనగా చెబుతారు.ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంవీ రమణారెడ్డి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణలోని 10 జిల్లాల ప్రత్యేకతలను తెలంగాణ తల్లి విగ్రహాంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి చీర, కరీంనగర్ వెండి మెట్టెలను పొందుపర్చారు. తెలంగాణ తల్లి వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతానికి గుర్తుగా పేద స్త్రీ రూపంలో ఎందుకు ఉండాలని అప్పట్లో కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహాం డిజైన్ తయారు చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ తల్లి విగ్రహం అప్పుడు, ఇప్పుడు

తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. అప్పట్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి జరీ అంచు పట్టు చీర ధరించి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం తయారు చేయించిన విగ్రహాంలో బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహానికి మెడలో బంగారం ఉంటుంది. కొత్తగా తయారు చేసిన విగ్రహానికి మెడలో బంగారు గొలుసు ఉంటుంది. పాత విగ్రహాం కుడిచేతిలో మొక్కజొన్న కంకులు పట్టుకొని ఉంటుంది. కొత్త విగ్రహాంలో ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ కంకులు ఉంటాయి.

పాత విగ్రహాం కుడి చేతికి బంగారు గాజులుంటాయి. కొత్త విగ్రహానికి ఉన్న కుడి చేయి అభయహస్తంగా ఉంది. చేతికి ఆకుపచ్చ గాజులున్నాయి. ఇప్పటి వరకు ఉన్న విగ్రహానికి కాళ్లకు వెండి పట్టీలున్నాయి. తాజా విగ్రహానికి కాళ్లకు మెట్టెలు, పట్టీలున్నాయి. పాత విగ్రహానికి కిరీటం, చేతిలో బతుకమ్మ ఉంటుంది. కొత్త విగ్రహానికి ఇవి లేవు. కానీ, కొత్త విగ్రహాం ఏర్పాటు చేసిన పీఠంలో పిడికిళ్లు బిగించినట్టుగా రూపొందించారు. కొత్త విగ్రహాంపై గులాబీ పార్టీ విమర్శలు చేయడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. తెలంగాణ ఉద్యమంలో చేసిన విగ్రహాం బీఆర్ఎస్ విగ్రహామా అని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

తెలుగు తల్లి నుంచి తెలంగాణ తల్లి వరకు

మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోవాలనుకున్న సమయంలో ఆంధ్రమాత భావన మొదలై తెలుగు తల్లి భావనగా స్థిరపడిందని చెబుతారు. 1942లో శంకరంబాడి సుందరాచార్యులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట రాశారు. ఈ పాటను ఓ సినిమా కోసం రాశారు. కానీ, ఈ పాటను సినిమాలో వాడలేదు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో ఈ పాట ప్రజాదరణ పొందింది.1975లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభల సమయంలో ప్రముఖ చిత్రకారులు కొండపల్లి శేషగిరి రావు తెలుగుతల్లి చిత్రాన్ని రూపొందించినట్టుగా చెబుతారు.తెలంగాణలో ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ తల్లి అనే పదాన్ని వాడారని చెబుతారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ కు ఆహ్వానం

తెలంగాణ తల్లి కొత్త విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఎర్రవల్లిలో కేసీఆర్ కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందించారు. డిసెంబర్ 9న జరిగే ఈ కార్యక్రమానికి రావాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఆయన ఆహ్వానం అందించారు.

హైకోర్టులో పిటిషన్

తెలంగాణ తల్లి విగ్రహాం రూపు మార్చడంతో ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని తెలంగాణ బీసీ కమిసన్ మాజీ సభ్యులు జూలూరు గౌరీశంకర్ చెప్పారు.ఈ విగ్రహా ప్రతిష్టను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డిసెంబర్ 7న హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. విగ్రహాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు చెప్పారు. ఎవరి విగ్రహాలు పెడుతున్నారో వారి ఆశయాలు సాధన కోసం ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహాం ఏర్పాటుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి

Show Full Article
Print Article
Next Story
More Stories