TS TET: తెలంగాణ టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

Telangana TET 2024 Applications date Extended
x

TS TET: తెలంగాణ టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

Highlights

TS TET: టెట్‌ దరఖాస్తు గడువు 20 వరకు పెంపు

TS TET: తెలంగాణ ఉపాద్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. దీంతో పాటు అభ్యర్ధులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ కల్పించారు. టెట్ దరఖాస్తులకు గతంలో నిర్దేశించిన గడువు బుధవారంతో ముగిసింది. ఇప్పటి వరకు ఒక లక్ష 93 వేల 135 దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం సెప్టెంబర్ లో నిర్వహించిన టెట్ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

అప్పటితో పోల్చితే ఈ సారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. మే 20వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి తెలంగాణ రాష్ర్ట ఆవిర్బావం తర్వాత 2015 నుంచి ఉపాధ్యాయుల అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 2.50 లక్షల మంది టెట్ లో అర్హత పొందారు. ఉపాద్యాయ కొలువు ఎంపికకు నిర్వహించే డీఎస్సీలో టెట్ కు 20 శాతం వెయిటేజి ఉంటుంది. దీంతో కొత్తగా డీఈడీ, బీఈడీ పాసైన అభ్యర్ధులతో పాటు గతంలో టెట్ పాస్ అయిన వారు సైతం మార్కులు పెంచుకునేందుకు మళ్లీ మళ్లీ ఈ పరీక్ష రాస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories