Telangana News: తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా

Telangana State New Symbol Inauguration Postponed
x

Telangana News: తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా

Highlights

Telangana Govt: తెలంగాణలో పొలిటికల్ చర్చకు దారితీసిన రాష్ట్ర అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది.

Telangana Govt: తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త లోగో ఆవిష్కరణపై సంప్రదింపులతో పాటు.. లోగోపై అభిప్రాయ సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొత్త చిహ్నానికి 200కు పైగా ప్రపోజల్స్ రావడంతో.. సాంకేతిక కారణాలతో లోగో ఆవిష్కరణ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం లోగో ఆవిష్కరణపై నిర్ణయం తీసుకోనుంది. దీంతో.. జూన్ 2న తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనుంది రేవంత్‌ సర్కార్.

ప్రస్తుతం అమల్లో అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. దీనిపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చర్చించారు. కొన్ని నమూనాలు సిద్ధం చేశారు. ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. వీటిని మంత్రివర్గ సహచరులకు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చూపించి, వారి సలహాలు, సూచనలు కూడా స్వీకరించి.. తుది రూపు ఇవ్వాలని రేవంత్‌ నిర్ణయించారు. మరిన్ని సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర అధికారిక చిహ్నానికి తుది రూపు ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories