Telangana SSC Results: పదో తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో మీ రిజల్ట్ చెక్ చేసుకోండి

Telangana SSC Results 2021 Released
x

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Highlights

Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు bse.telangana.gov.in, bsetelangana.org వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల.. చదివిన పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే హాల్‌టికెట్‌ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్‌ వచ్చిందో తెలుసుకోవచ్చు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరంలో కేవలం 44 రోజులు మాత్రమే పాఠశాలలు నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థులకు ఒక ఫార్మేటీవ్ అసెస్మెంట్(FA-1) పరీక్షను నిర్వహించారు. ప్రతీ సబ్జెక్టులో 20 మార్కులకు ఆ పరీక్ష నిర్వహించారు. ఈ మార్కులను ఐదింతలు పెంచి వంద మార్కులకు గానూ ఫలితాలను అధికారులు రూపొందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories