TG Liquor Revenue: మద్యమా? మంచినీళ్లా? ఏందీ భయ్యా ఇది..మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డ్..8 నెలల్లో 20వేల కోట్లు

TG Liquor Revenue
x

TG Liquor Revenue

Highlights

TG Liquor Revenue: తెలంగాణలో మద్యం విక్రయాల ద్వారా 8 నెలల్లో రూ. 20వేల కోట్ల ఆదాయం సమకూరింది.

TG Liquor Revenue: తెలంగాణలో మద్యం విక్రయాల ద్వారా 8 నెలల్లో రూ. 20వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నుంచి నవంబర్ మద్య ..మద్యం విక్రయాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించింది.

తెలంగాణలో మద్యం విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు ఎనిమిది నెలల్లో రూ. 210, 903. 13కోట్ల ఆదాయం సమకూరినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాలపై రెవెన్యూ రూపేణా రూ. 10,285.58 కోట్ల విలువ ఆధారిత పన్ను రూపంలో రూ. 10, 607.55 కోట్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అసెంబ్లీలో ప్రకటించింది.

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు కేపీ వివేకానంద, హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్ లు అడిగిన ప్రశ్నలకు అబ్కారీ శాఖ సమాధానం ఇచ్చింది. బెల్టు షాపులు ఎన్ని ఉన్నాయని సభ్యులకు అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలో బెల్ట్ షాపులకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అక్రమ మద్యం విక్రయాలను కట్టడి చేస్తున్నామని ఎక్సైజ్ చట్టాల ప్రకారం ఎప్పటికప్పుడు అనధికారిక మద్యం విక్రయాలపై కేసులు నమోదు చేస్తున్నామని సభలో ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నాటికి అనధికారిక విక్రయాలపై 6,915 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసుల్లో 6,728 మందిని అరెస్టు చేయడంతోపాటు 74,425 లీటర్ల మద్యం 353 వాహనాలను జప్తు చేసినట్లు తెలిపారు. మద్యపాన దుష్ప్రభావాలు, మత్తు పదార్థాల దుర్వినియోగంపై తెలంగాణ 735 అవగాహన సదస్సులు నిర్వహించారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలతో ఏపీలో ఎక్సైజ్ శాఖకు దాదాపు 36వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అన్ని రకాల ఖర్చుల మినహాయింపుగా దాదాపు రూ. 30వేల కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి లభించింది. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను గణనీయంగా పెంచడంతోపాటు ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories