ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో విచారణ ముమ్మరం.. మోస్ట్ వాంటెడ్‌గా కీలక పాత్రదారి జగ్గుస్వామి

Telangana Police Look Out Notice For Jaggu Swamy
x

ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో విచారణ ముమ్మరం.. మోస్ట్ వాంటెడ్‌గా కీలక పాత్రదారి జగ్గుస్వామి

Highlights

* ముందస్తుగా నోటీసులు జారీచేసిన సిట్.. ఎమ్మెల్యేల ఎరతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

TRS MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన కేసులో కేరళకు చెందిన జగ్గు స్వామిని వాంటెడ్ వ్యక్తిగా పేర్కొంటూ తెలంగాణ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. డాక్టర్ కొట్టిలిల్ నారాయణ్ జగ్గు అలియాస్ జగ్గు స్వామి ఎర్నాకులంలోని అమృత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్ గా గుర్తింపు పొందారు. నలుగురు TRS ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపి పార్టీ ఫిరాయింపజేసేందుకు జరిగిన కుట్రలో కీలక పాత్ర పోషించారని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

ప్రజాస్వాబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు, అస్థిరపరిచేందుకు పాల్పడ్డారంటూ... నోటీసులో పేర్కొన్నారు. జగ్గు స్వామి తన నివాసం, పని స్థలం నుండి పరారీలో ఉన్నాడని.. భారతదేశం అంతటా అన్ని పోలీసు యూనిట్లకు, పోలీసు స్టేషన్ లకు లుక్ అవుట్ నోటీసును తెలంగాణ పోలీసులు పంపించారు. అతను కనపడ్డా, అతనికి సంబంధించిన విషయాలేమైనా తెలిసినా హైదరాబాద్ సిటీ కంట్రోల్ రూమ్ కు ఆధారాలను అందించాలని నోటీసులో పోలీసులు కోరారు.

ఫామ్ హౌజ్ కేసులో రెండో రోజు సిట్ ముందు విచారణకు అడ్వకేట్ శ్రీనివాస్ హాజరయ్యారు. అధికారులు అడిగిన వివరాలతో పాటు మొబైల్ ఫోన్, బ్యాంక్ స్టేట్ మెంట్ తో శ్రీనివాస్ విచారణకు హాజరయ్యాడు. శ్రీనివాస్ ను సిట్ బృందం పలు కోణాల్లో విచారించింది. బీజేపీ దేశవ్యాప్తంగా పలు సంస్థలతో దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. దాడులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. అధికారం శాశ్వతం కాదన్న మంత్రి తలసాని అధికారం మారినప్పుడు సాంప్రదాయం కొనసాగుతుందని అది బీజేపీ నేతలు మర్చిపోవద్దని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న IT & ED దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ చెప్పు చేతల్లో పెట్టుకున్న బీజేపీ కావాలనే తమ పార్టీలో చేరని నేతలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయిస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తప్పుదోవ పట్టించేందుకు ఎమ్మెల్యేల కేసును తెరమీదికి తెచ్చారన్నారు. బీఎల్ సంతోష్ జోలికి వస్తే సహించేది లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories