తెలంగాణ కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా సచివాలయ నిర్మాణం

Telangana New Secretariat work is in full swing
x

న్యూ సెక్రటేరియట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

* ఇతర నగరాల్లో కట్టడాలను పరిశీలించనున్న మంత్రుల బృందం * 2021 అక్టోబర్‌లోగా కొత్త సచివాలయ నిర్మాణం పూర్తి!

ఆధునిక హంగులతో కొత్త సచివాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ నడుంబిగించారు. రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా జరుగుతున్న నిర్మాణ పనులకు మరోసారి తుది మెరుగులు దిద్దారు. అదేవిధంగా భవన నిర్మాణంలో వివిధ ప్రాంతాలకు చెందిన రాళ్లను వినియోగించాలని తెలంగాణ సర్కార్‌ భావిస్తోంది.

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే భవనం బయట, అంతర్గత మార్పులు చేస్తూ టీఆర్ఎస్‌ సర్కార్‌ ఇటీవలే తుది నిర్ణయం తీసుకుంది. మొత్తం ఏడంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించనుండగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా జనవరిలో సచివాలయ పనులను సీఎం కేసీఆర్‌ నేరుగా పర్యావేక్షించారు. మరోవైపు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేస్తున్నారు.

తెలంగాణ కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా సచివాలయ నిర్మాణం అద్భుత రీతిలో ఉండాలని ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి సచివాలయ డిజైన్‌పై సీఎం కసరత్తులు చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. భవన నిర్మాణం కోసం.. జైపూర్‌ నుంచి రాళ్లు తెప్పించి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఢిల్లీలో పార్లమెంట్‌ భవనానికి వినియోగించే రాయిపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

మరోవైపు పార్లమెంట్‌ కట్టడానికి సంబంధించిన విషయాలను ఆరా తీయడంతోపాటు ఆప్రాంతాన్ని పరిశీలించడానికి ఢిల్లీకి మంత్రులను పంపించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇక పనిలోపనిగా ఇతర నగరాలలో నిర్మించిన కట్టడాలను కూడ మంత్రుల బృందం పరిశీలించనుంది. అయితే వచ్చే నెల నాటికి మంత్రులు అత్యున్నత కట్టడాల పరిశీలన పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌లోగా కొత్త సచివాలయ నిర్మాణం పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories