దక్షిణ మధ్య రైల్వే జీఎం తో తెలంగాణ ఎంపీల భేటీ.. తెలుగు రాష్ట్రాలకు బుల్లెట్ రైలు లేనట్లే

Telangana MPs Meeting with South Central Railway General Manager Gajanan Mallya
x

దక్షిణ మధ్య రైల్వే జీఎంతో తెలంగాణ ఎంపీల భేటీ(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*తెలుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ రైలు ఇప్పట్లో లేనట్లే? *మళ్లీ తెరమీదకు శంషాబాద్ MMTS రైలు ప్రాజెక్టు

Gajanan Mallya-TS MPs: దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా వ్యాఖ్యలతో ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ రైలు లేనట్లేనని తెలుస్తోంది. దక్షిణమధ్యరైల్వే జీఎంతో తెలంగాణ ఎంపీల సమావేశం సందర్భంగా కీలక చర్చ జరిగింది. అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు విజయవంతం అయితే రెండో ప్రాజెక్టుపై ఆలోచిస్తామని గజానన్‌ మాల్యా తేల్చి చెప్పారు.

మరోవైపు ఏడేళ్లయినా కేంద్రం ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు కాకపోవడంతో ప్రత్యామ్నాయం చూడాల్సిందిగా తెలంగాణ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. దీంతో మళ్లీ శంషాబాద్ MMTS ప్రాజెక్టు మరోసారి తెరమీదికొచ్చింది. దక్షిణమధ్యరైల్వేతో శంషాబాద్ రైలు ప్రాజెక్టుపై ఇప్పటికే జీఎంఆర్ ప్రాధమిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories