TS Assembly Sessions 2021: ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Monsoon Assembly Sessions 2021 from Today | Telugu Online News
x

ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Highlights

TS Assembly Sessions 2021: ఉభయ సభల్లో మొత్తం 8 కీలక బిల్లులను ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...

TS Assembly Sessions 2021: తెలంగాణ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలకు సర్వం సిద్ధం అయింది. శుక్రవారం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. అధికార ప్రతిపక్షాలు సభాసమరానికి సంసిద్దులైనారు. సభ తొలి రోజున ఇటీవల కన్నుమూసిన ఎమ్మెల్యేలు, మండలి సభ్యులకు సభ సంతాపం తెలుపనున్నది. ఆ తర్వాత స్పీకర్, చైర్మన్ అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం కానున్నది. సభ ఎన్నిరోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. అసెంబ్లీ బయట పరిసరాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ నిర్వహణ, భద్రత పై అధికారులతో స్పీకర్ సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలు అమలు చేస్తూ సభను నిర్వహించనున్నారు. అసెంబ్లీ లోనే కరోనా టెస్ట్ లు, వాక్సిన్ అందుబాటులో ఉంచనున్నారు. మీడియా కు కూడా కొన్ని నిబంధనలు విధించారు. అదే విధంగా అసెంబ్లీలోకి విజిటర్స్ కు అనుమతించడం లేదు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన దళిత బంధు పథకంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. దీనిపై ప్రత్యేక చర్చ చేపట్టాలని సీఎం కేసీఆర్ స్పీకర్ అనుమతి కోరే అవకాశం ఉంది. యాసంగిలో వరిసాగు, ధాన్యం కొనుగోలు అంశం, తెలుగు రాష్ర్టాల మధ్య జలజగడం, ఉద్యోగ నియామకాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ, విద్యుత్ ఛార్జీల పెంపు సహ ఇతర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను నెలాఖరు లోపు క్లోజ్ అయ్యే విధంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం నుంచి వరుసగా 4 లేదా 6 రోజుల సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే ప్రజా సమస్యలు చాలా ఉండటంతో 30 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి.

ప్రతి ప్రతిపక్షాలు యాక్టివ్ గా ఉండడంతో అసెంబ్లీ లోపల బయట భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీకి వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. గన్ పార్క్ చుట్టూ ఎత్తైన బారికేడ్లు ఏర్పాటు చేశారు. గన్ పార్క్ లో నుంచి అసెంబ్లీ వైపు ఎవరూ రాకుండా ప్రగతి భవన్ దగ్గర వున్నట్లు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యే అధికారులకు, ఉద్యోగులకు ప్రత్యేక పాస్ లు జారీ చేశారు. ముట్టడి చేసేవాళ్ళు ఎక్కువమంది పబ్లిక్ గార్డెన్ గేట్ దగ్గరకు వస్తుంటారు. ఈ సారి పబ్లిక్ గార్డెన్ దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులకు డ్యూటీ వేశారు కంట్రోల్ రూమ్ వైపు నుంచి అసెంబ్లీ వైపు రాకుండా భారీగా పోలీసులు మోహరించే విధంగా ప్లాన్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories