Minister Talasani Srinivas Yadav about CM KCR: సీఎం కనిపించకపోతే రాష్ట్రంలో పాలన ఆగిందా?

Minister Talasani Srinivas Yadav about CM KCR: సీఎం కనిపించకపోతే రాష్ట్రంలో పాలన ఆగిందా?
x
Talasani Srinivas Yadav About CM KCR
Highlights

Minister Talasani Srinivas Yadav about CM KCR: గత కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం మీడియా ముందుకు, ప్రజల ముందుకు రాకపోవడంతో సీఎంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Minister Talasani Srinivas Yadav about CM KCR: గత కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం మీడియా ముందుకు, ప్రజల ముందుకు రాకపోవడంతో సీఎంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ సీఎం కనిపించకపోవడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై తలసాని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదనటం సరైంది కాదని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మంచి సదుపాయాలున్నాయని చెప్పారు. కొత్త సచివాలయ నిర్మాణం గురించి స్పందిస్తూ.. పరిపాలన కోసం సచివాలయం కీలకమని, కొత్తది కడితే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు చేతనైతే ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలని హితవు పలికారు. ఎంఐఎంతో కలిస్తే కరోనా వచ్చేస్తోందా? కేంద్రమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కనిపించకపోతే ఇప్పుడు తెలంగాణలో ఏమైనా పాలన ఆగిందా? ప్రభుత్వ పథకాలు నిలిచిపోయాయా? అని నిలదీశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతిపక్షాలు పనికిరాని దద్దమ్మలు అంటూ తీవ్ర వ్యాఖ్యానించారు.

ఫిజికల్ ఫిట్‌నెస్ లేనివారు, సరిగ్గా రోగ నిరోధక శక్తి లేనివారు మాత్రమే కరోనాతో బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నందున మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ప్రయోజనం ఉండదని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. కరోనా ఏ స్థాయిలో ఉన్నా.. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్‌ను ఆపగలరని వ్యాఖ్యానించారు. మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ నేత వి.హన్మంతరావే ఉదాహరణ అని గుర్తు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories