Coronavirus: మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా పాజిటివ్‌

Telangana Minister Satyavathi Rathod tests positive for Coronavirus
x

Coronavirus: మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా పాజిటివ్‌

Highlights

Coronavirus: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు...

Coronavirus: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా గిరిజన అభివృద్ధి శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా సోకింది. ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ ఉదయం కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆమె హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు, తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories