Double Bed Room Houses: పేదలకు ప్రాధాన్యత ఇవ్వండి.. డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపికపై కేటీఆర్ ఆదేశం

Double Bed Room Houses: పేదలకు ప్రాధాన్యత ఇవ్వండి.. డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపికపై కేటీఆర్ ఆదేశం
x
Highlights

Double Bed Room Houses | పేదలకు గూడు కల్పిచేందుకు తెలంగాణా ప్రభుత్వం నిర్మాణం చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కు లబ్ధిదారుల ఎంపికలో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు..

Double Bed Room Houses | పేదలకు గూడు కల్పిచేందుకు తెలంగాణా ప్రభుత్వం నిర్మాణం చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కు లబ్ధిదారుల ఎంపికలో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.. ఈ ఇళ్లన్నీ పూర్తి కావస్తున్న తరుణంలో ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు శ్రీకారం చుట్టింది. .

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని గృహ నిర్మాణ కార్యక్రమాలపై హౌసింగ్‌ శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డితో కలసి ఆయన గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ, హౌసింగ్‌ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఇతర జిల్లాల కలెక్టర్లతో కలసి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సూచించారు.

జీహెచ్‌ఎంసీ కోసం ఇతర జిల్లాల పరిధిలో కడుతున్న ఇళ్లలో పది శాతం లేదా 1,000 మించకుండా స్థానికులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని మంత్రులు తెలిపారు. గతంలో ఇల్లు పొందిన వారికి మరోసారి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు రాకుండా చూడాలని సూచించారు. డబుల్‌ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో గ్రీనరీకి ప్రాధాన్యం ఇవ్వాలని, ఇప్పటి నుంచే అక్కడ మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో హౌసింగ్‌ శాఖ అధికారులతో కలిసి పనిచేయాలని అధికారులకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. త్వరలోనే మరోసారి హౌసింగ్‌ శాఖ అధికారులతో సమావేశం అవుతామని కేటీఆర్‌ తెలిపారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్, హౌసింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాలకు చూపించిన మంత్రి తలసాని

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్లను రాష్ట్ర పశుసంవర్థ్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ వి.హనుమంతరావు పరిశీలించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయంలో శాసనసభలో జరిగిన చర్చలో భట్టి చేసిన సవాల్‌ను మంత్రి తలసాని స్వీకరించారు. గురువారం ఉదయమే భట్టి ఇంటికి వెళ్లిన తలసాని.. ఆయన్ను తీసుకుని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్లను చూపించారు. ఇళ్ల నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో వివరించారు.

నెక్లెస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ నగర్, బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌లోని గంగిడి ఎల్లయ్యదొడ్డి (జీవై కాంపౌండ్‌), చాచానెహ్రూనగర్, పొట్టిశ్రీరాములు నగర్, బండమైసమ్మనగర్‌ బస్తీల్లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను వారు పరిశీలించారు. జియాగూడ, గోడేకిఖబర్, కట్టెలమండి, మారేడ్‌ పల్లి, అంబేడ్కర్‌నగర్, జీజీనగర్‌లలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలను భట్టి నోట్‌ చేసుకున్నారు. ఆయా బస్తీల్లో ఎన్ని ఇళ్లు కడుతున్నారు.. ఎంతమంది పేదలకు ప్రయోజనం కలుగుతుంది వంటి విషయాలను తలసాని ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, కాంగ్రెస్‌ నాయ కులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే..: తలసాని

మురికివాడల్లో నివసించే ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలపై పైసా భారం లేకుండా ఉచితంగా ఇళ్లను నిర్మిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పోష్‌ కాలనీలను తలపించేలా నిర్మిస్తున్నందున పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు.

నేను చూసింది 3,428 ఇళ్లనే: భట్టి

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు చోట్ల డబుల్‌ బెడ్రూం ఇళ్లను పరిశీలించడానికి మంత్రి తలసానితో కలిసి వెళ్లానని, అయితే తాను గురువారం 3,428 ఇళ్లు మాత్రమే చూశానని భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం కూడా ఇళ్ల పరిశీలనకు వెళుతున్నానని, పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ విషయంపై స్పందిస్తానని చెప్పారు. తాము చూసిన వాటిలో చాలావరకు పాత ఇళ్లను కొత్తగా నిర్మిస్తున్నవేనని వ్యాఖ్యానిం చారు. ఈ ఇళ్ల నాణ్యతపై కొందరు ఇంజనీర్లు పరిశీలిస్తున్నారని, వారి నివేదిక వచ్చిన తర్వాత నాణ్యత గురించి కూడా చెబుతానన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామంటే తాము ఇళ్లు ఖాళీ చేసి వెళ్లామని, చాలా రోజులైనా తమకు ఇళ్లు ఇవ్వకపోవడంతో అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు తనతో చెప్పారని భట్టి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories