Telangana: మరో మంత్రికి కరోనా పాజిటివ్‌

Telangana Minister Koppula Eshwar Testes covid19 Positive
x

కొప్పుల ఈశ్వర్ ఫైల్ ఫోటో 

Highlights

Telangana: తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

Telangana: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతుంది. క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన ఆంక్ష‌లు విధించాయి. కొన్ని రాష్ట్రాల్లో క‌ర్ఫ్యూ లు, లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ క‌రో్నా మ‌హ‌మ్మ‌రి బారిన ప‌డుతున్నారు.

తెలంగాణలో ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి కూడా క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. అంతేకాదు చాలమంది ప్రజాప్రతినిధులకు కరోనా బారిన ప‌డ్డారు. తాజాగా మరో మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కాగా గత కొన్ని రోజుల నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ వరుస ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

రెండురోజులుగా అస్వస్థతగా ఉండడంతో కొప్పుల ఈశ్వర్ కోవిడ్19 పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. వైద్యుల సహాయ మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,148 కరోనా పరీక్షలు చేపట్టగా 5,186 పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385కి చేరింది. 4,21,219 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 68,462 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,704కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 904 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 7,994 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories