Covid19 Updates: హరీశ్ రావు పీఏకు కరోనా..

Covid19 Updates: హరీశ్ రావు పీఏకు కరోనా..
x
Representational Image
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడయితే లాక్ డౌన్ ను నిబంధనలను సడలించిందో అప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా...

తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడయితే లాక్ డౌన్ ను నిబంధనలను సడలించిందో అప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్ వ్యాప్తి ప్రారంభించిన మొదట్లో ఒకట్ల సంఖ్యలో నమోదయిన కేసులు ప్రస్తుతం 200లకు మించి నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కరోనా వైద్యం అందించే ఆస్పత్రుల్లో బెట్లు పూర్తిగా నిండిపోయాయి. పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులతో పాటు ప్రస్తుతం నాయకులకు, వారి వద్ద పనిచేసే వారికి కూడా కరోనా సోకుతుంది.

ఇక పోతే ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉండే మంత్రి హరీశ్ రావు సిద్దిపేట పీఏకు కరోనా సోకినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక నిన్నటికి నిన్న హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా సోకిందనే వార్త వచ్చి ఒక్క రోజు కూడా గడవక ముందే ఈరోజు మరో వార్త షాకిస్తోంది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నారు.

ఇందులో భాగంగానే సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ మధ్య కాలంలో జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా వారితో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆ కరోనా బాదితుడు హైదరాబాద్‌‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం గురించిన సమాచారం రావడంతో వెంటనే కలెక్టర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఇంటి నుంచే పనులను చక్కబెడుతున్నారు. అదే విధంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. యాదాద్రి జడ్పీ సీఈవోకు కరోనా పాజిటివ్ అని తేలగా జూన్ 5వ తేదీన ఆయనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న, ఆయనతో కాంటాక్టులో ఉన్న అధికారులు, ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories