Telangana Job Calendar 2024: జాబ్‌ క్యాలెండర్‌ వచ్చింది.. ఏ ఉద్యోగానికి ఎప్పుడు పరీక్ష.. పూర్తి షెడ్యూల్..!

Telangana Job Calendar 2024 Released
x

Telangana Job Calendar 2024: జాబ్‌ క్యాలెండర్‌ వచ్చింది.. ఏ ఉద్యోగానికి ఎప్పుడు పరీక్ష.. పూర్తి షెడ్యూల్..!

Highlights

Telangana Job Calendar 2024 Released: అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం 2024- 25 జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది.

Telangana Job Calendar 2024 Released: అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం 2024- 25 జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ పై స్టేట్మెంట్‌ను సభలో చదివి వినిపించారు. నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముందే చెప్పామని.. ఆ విధంగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు, రద్దు కావడం, వాయిదా వేయడం, ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షల తేదీలు ఓవర్ లాప్ తో ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు సీఎం రేవంత్.. UPSC కమిషన్ ఛైర్మన్‌ను సంప్రదించారన్నారు.

UPSC, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించామన్నారు భట్టి. గ్రూప్-1 నోటిఫికేషన్ లో అదనంగా 60 పోస్టులు జోడించి 563 ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి, ఫలితాలు ప్రకటించామన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేశామన్నారు. అధికారంలోకి రాగానే 32 వేల 410 మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అదనంగా 13 వేల 505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకుందన్నారు. 11 వేల 22 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. గ్రూప్- వన్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేశామన్నారు. ఆగస్టు 1న జరిగిన క్యాబినెట్ సమావేశంలో జాబ్ క్యాలెండర్ గురించి చర్చించి ఆమోదించామని, 2024- 25 జాబ్ క్యాలెండర్ను సభ్యులందరికీ జారీ చేశామని చెప్పారు భట్టి.

అక్టోబర్‌లో ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు భట్టి తెలిపారు. అక్టోబర్‌లో ఏఈఈ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. నవంబర్‌లో టెట్‌ నోటిఫికేషన్‌ ఉంటుందన్నారు. అక్టోబర్‌లో మరో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, 2025 ఏప్రిల్ లో మరో DSC, ఇదే నెలలో ఫారెస్ట్ ఉద్యోగాలు, 2025 జూన్ లో మరో టెట్, జులై 2025 గ్రూప్ -1 మెయిన్స్, ఆగస్టు 25లో SI పరీక్షలు, పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్షలు ఇదే నెలలో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2025 సెప్టెంబర్ నెలలో అకాడమిక్ పోస్టులైన ఇంటర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులు, లైబ్రేరియన్ పోస్టుల పరీక్షలు, 2025 అక్టోబర్ నెలలో గ్రూప్ -2, గ్రూప్ -3 నవంబర్ 2025, ఇదే నెలలో SCCL లలో కేటగిరీల పోస్టుల భర్తీ నిర్వహించినున్నట్లు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఇచ్చిన సర్కులర్ పేపర్లలో మెన్షన్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories