Union Budget 2021 : కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఆశలు

Union Budget 2021 : కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఆశలు
x

Union Budget 2021 : కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఆశలు

Highlights

రానున్న ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టున్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా...

రానున్న ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టున్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు నేరుగా రావాల్సిన అంశాలపై ఫోకస్ చేసింది. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తోంది. ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాలకు స్పెషల్ గ్రాంటుల మంజూరు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, రుణాలు సమకూర్చుకునే విషయంలో స్వేచ్ఛనిస్తారా అంటూ ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఆర్థిక సంఘాలు చేసే సిఫారసుల ఆధారంగా రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చే ఆనవాయితీ చాలా కాలంగా నడుస్తోంది. కానీ, గతేడాది బడ్జెట్‌లో ఈ ఆనవాయితీని పక్కన పెట్టారు. దాంతో 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రావాల్సిన రాష్ట్రాల గ్రాంట్లు తెలంగాణకు రాలేదు. ఈ బడ్జెట్‌లో అయిన నిధులు విడుదల చేయాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు.

సెస్‌లు, సర్ చార్జీలను రాష్ట్రాకు వాలా కల్పించే పన్ను మొత్తంలో కలపడానికి కేంద్ర బడ్జెట్‌లో శ్రీకారం చుడుతుందో చూడాలి. కరోనా కష్టకాలంలో రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కలిగేందుకు ఎఫ్ఆర్‌బీఎం నిబంధనల సడలించేలా చూడాలి. రాష్ట్రంలో వెనకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం సహకరించేలా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ పథకాన్ని తెలంగాణలో వర్తింపజేస్తారా..? అనేది చూడాలి. జీఎస్టీ పరిహారాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ఇవ్వాలి. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద ఇచ్చే పింఛన్‌ను 200నుంచి వెయ్యి రూపాయలకు పెంచేలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories