Telangana: దేశంలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీశాఖ మంత్రి బాబుల్ సుప్రియో అధికారికంగా...
Telangana: దేశంలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీశాఖ మంత్రి బాబుల్ సుప్రియో అధికారికంగా ప్రకటించారు. ఇవాళ రాజ్యసభలో కాంగ్రెస్ నేత జీ.సీ చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు మంత్రి బాబుల్ సుప్రయో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటితే 2019-20లో ఒక్క తెలంగాణలోనే 38.17 కోట్ల మొక్కలు నాటారని వెల్లడించారు.
దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ర్టంగా తెలంగాణ రాష్ర్ట రికార్డు సాధించడం పట్ల రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరిత హారం కార్యక్రమం వల్లే తెలంగాణకు ఈ ఘనత లభించిందన్నారు. సీఎం కేసీఆర్ ట్విట్టర్ ద్వారా సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు.
With all respects, would like to congratulate our Honble CM #KCR sir as our state has officially declared as most saplings planted in the country, as declared by Hon'ble Minister for Forest @SuPriyoBabul ji, All happened because of our CM sir's dream project #Harithahaaram🙏. pic.twitter.com/HufJXWMi60
— Santosh Kumar J (@MPsantoshtrs) March 8, 2021
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire