Telangana: అఖిల ప్రియ భూ వివాదంలో కొత్త ట్విస్ట్

Telangana High Court Verdict On Hafeezpet Lands
x

Telangana: అఖిల ప్రియ భూ వివాదంలో కొత్త ట్విస్ట్

Highlights

Telangana: హఫీజ్‌పేట్‌ వివాదాస్పద భూములపై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.

Telangana: హఫీజ్‌పేట్‌ వివాదాస్పద భూములపై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. సర్వే నెంబర్-80లోని 140 ఎకరాలు ప్రైవేట్ భూమేనన్న హైకోర్టు వక్ఫ్ అండ్ ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఇక, పిటిషనర్లకు 4లక్షల రూపాయలు చెల్లించాలని వక్ఫ్ బోర్డ్‌తోపాటు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, 50 ఎకరాలను ప్రవీణ్‌రావుతోపాటు సహ యజమానుల పేరిట నమోదు చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. దాంతో, హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, హఫీజ్‌పేట్‌ భూవివాదంలోనే ఇటీవల ప్రవీణ్‌రావు కిడ్నాప్‌ వ్యవహారం జరగడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. హఫీజ్‌పేట్ భూవివాదంలోనే ప్రవీణ్ రావు కిడ్నాప్ అభియోగంపై ఇటీవల అఖిలప్రియ సహా పలువురిని అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories