బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి బిగ్ రిలీఫ్.. కాంగ్రెస్ నేత పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..

Telangana High Court set Back for Asifabad Congress Leader Azmeera Shyam Naik
x

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి బిగ్ రిలీఫ్.. కాంగ్రెస్ నేత పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..

Highlights

Asifabad: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది.

Asifabad: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆమె ఎన్నిక చెల్లదని హైకోర్టులో శ్యామ్ పిటిషన్ వేశారు.

కోవా లక్ష్మి ఆ ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచారంటూ పిటిషన్‌లో ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు అజ్మీరా శ్యామ్ పిటిషన్‌ను కొట్టివేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోవా లక్ష్మి 22 వేల 798 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్‌పై విజయం సాధించారు.

కాంగ్రెస్ అభ్యర్ధి పిటిషన్ ఏంటి?

బీఆర్ఎస్ అభ్యర్ధి కోవా లక్ష్మి ఎన్నికల అఫిడవిట్ లో ఇన్ కం ట్యాక్స్ లెక్కలు తప్పులున్నాయని కాంగ్రెస్ అభ్యర్ధి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 9 నెలల పాటు ఈ పిటిషన్ పై హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్నది. చివరకు కాంగ్రెస్ అభ్యర్ధి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్ లో ఆమె ఎక్కడా కూడా తప్పుడు పత్రాలు సమర్పించలేదని.. అన్ని సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించింది.

2006లో ఆసిఫాబాద్ సర్పంచ్ గా కోవా లక్ష్మి గెలిచారు. 2010లో తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. 2013లో ఆసిఫాబాద్ సర్పంచ్ గా గెలిచారు. 2014 లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఆసిఫాబాద్ నుంచి గెలిచారు. 2018 ఎన్నికల్లో ఆమె ఓడారు. 2019లో జైనూరు జడ్పీటీసీగా గెలిచి కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా గెలిచారు.2023లో ఆసిఫాబాద్ నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా నెగ్గారు.

Show Full Article
Print Article
Next Story
More Stories