Telangana: నైట్‌ కర్ఫ్యూ విధిస్తే సరిపోతుందా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

Telangana High Court Serious On TS Govt For Neglecting
x

Telangana: నైట్‌ కర్ఫ్యూ విధిస్తే సరిపోతుందా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

Highlights

Telangana: తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Telangana: తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 రోజుల్లోనే రాష్ట్రంలో ఆక్సిజన్‌ నిల్వల కొరత ఎలా ఏర్పడిందని ప్రశ్నించింది. కేసు విచారణకు ప్రభుత్వం తరపున ఏజీ, రాష్ట్ర హెల్త్‌ సెక్రటరీ రీజ్వి హాజరయ్యారు. కరోనా కట్టడికి ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తోందని, కేసులు తగ్గుతున్నాయని ఏజీ చెప్పగా, ఎక్కడ తగ్గాయో చూపించాలని న్యాయస్థానం నిలదీసింది.

బార్లు, థియేటర్ల దగ్గర కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని న్యాయస్థాన కోరింది. కుంభమేళా వెళ్లినవారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్‌లో పెడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది, రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి చర్యలు చేపట్టారని వివరణ అడిగింది.

ఇతర దేశాల నుంచి వస్తున్నవారిని ఆర్‌టీపీసీఆర్‌ రిపోర్ట్‌ ఎందుకు అడగడంలేదు అని ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నించింది. వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నారని నిలదీసింది. 3 రోజుల్లోనే ఆక్సిజన్‌ నిల్వల కొరత ఎలా ఏర్పడిందని ప్రశ్నించింది. ప్రభుత్వం ఇచ్చిన వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణను వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories