Telangana: రేపటి కోకాపేట,ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరణ

Telangana High Court Refuses to Stop Auction of Kokapet And Khanamet Lands Tomorrow
x

తెలంగాణ హైకోర్టు (ఫైల్ ఫోటో)

Highlights

*కోకాపేటలో 44.94,ఖానామెట్‌లో 14.92 ఎకరాలు వేలానికి ఏర్పాట్లు *భూముల వేలంపై విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ

TS High Court: రేపు జరగాల్సిన కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాలు వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే భూముల వేలంపై విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భూముల విక్రయానికి సంబంధించిన జీవో 13ను కొట్టివేయాలని విజయశాంతి కోరింది. మరోపక్క.. భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదముందని, అందుకే వేలం వేస్తున్నామని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వమే భూములను కాపాడుకోలేక అమ్ముకోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది హైకోర్టు. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటుపై వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories