అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించకండి: హైకోర్టు

అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించకండి: హైకోర్టు
x
High Court (File Photo)
Highlights

లైంగిక వేధింపులకు గురైన బాధితుల పేర్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, వారి పూర్తి వివరాలు ఎఫ్ ఐఆర్ లో నమోదు చేసి బహిర్గతం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

లైంగిక వేధింపులకు గురైన బాధితుల పేర్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, వారి పూర్తి వివరాలు ఎఫ్ ఐఆర్ లో నమోదు చేసి బహిర్గతం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలనుఆ దేశించింది. 'నిపుణ్‌ సక్సేనా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా' కేసులో ఐపీసీ సెక్షన్‌ 228ఏ, పోక్సో చట్టం కింద సుప్రీంకో ర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వివరాలను వెల్లడించరాదని స్పష్టంచేసింది.

కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న వ్యక్తి అక్కడి విద్యార్థినిని 2017 అక్టోబర్‌ 28న 9వ తరగతి చదివే విద్యార్థిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణల కేసు విచారణలో దర్యా ప్తు అధికారులు ఎఫ్‌ఐఆర్‌, రిమాండ్‌ రిపోర్ట్‌, చార్జిషీట్‌లో యథేచ్ఛగా విద్యార్థిని, తల్లిదండ్రుల పేర్లను ఉపయోగించడాన్ని జస్టిస్‌ పీ నవీన్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం తప్పుబట్టింది. దీనిపై విచారణ చేపట్టిన హైకో ర్టు కేవీ సొసైటీ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు చేపట్టవచ్చని, దానికి క్రిమినల్‌ కేసు విచారణకు సంబంధం లేదని పేర్కొన్నది.

ఇలాంటి కేసులలో బాధితుల వివరాలను వెల్లడించవద్దని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించేలా అన్ని ఠాణాలకు ఆదేశాలివ్వాలని డీజీపీకి సూచించింది. బాధితుల పేర్లకు సంబంధించి విద్యాసంస్థలు, మీడియా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేలా మార్గదర్శకాలు రూపొందించాలని సీఎస్‌ను ఆదేశించింది. బాధితుల పేర్లను సీల్డ్‌ కవర్‌లో మాత్రమే అందించాలని తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories