Telangana Jobs: తెలంగాణలో జడ్జి పోస్టులకి నోటిఫికేషన్.. అర్హులు ఎవరంటే..?

Telangana High Court Notification 2022 for 13 district judge Posts | Live News Today
x

Telangana Jobs: తెలంగాణలో జడ్జి పోస్టులకి నోటిఫికేషన్.. అర్హులు ఎవరంటే..?

Highlights

Telangana Jobs: తెలంగాణలో లా చదివిన వారికి సువర్ణవకాశమని చెప్పవచ్చు...

Telangana Jobs: తెలంగాణలో లా చదివిన వారికి సువర్ణవకాశమని చెప్పవచ్చు. జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జ్యూడిషియన్‌ సర్వీసెస్‌లో జిల్లా జడ్జి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. ఇవన్ని జిల్లా జడ్జి (ఎంట్రి లెవల్‌) పోస్టులు.

ఈ పోస్టులకి అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.51550ల నుంచి రూ.63,070ల వరకు చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్‌ విడుదలైన నాటికి అభ్యర్థులు 7 ఏళ్లకు తగ్గకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తూ ఉండాలి. రాత పరీక్ష, వైవా వాయిస్‌ (ఇంటర్వ్యూ) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. సివిల్‌ లా, క్రిమినల్‌ లా, ఇంగ్లిష్‌ అనే మూడు పేపర్లకు రాత పరీక్ష ఉంటుంది. ప్రతి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. 3 గంటల పాటు పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు వైవా నిర్వహిస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది.

జనరల్‌ అభ్యర్ధులు దరఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ మే 2, 2022 సాయంత్రం 5 గంటలుగా నిర్ణయించారు. అభ్యర్థులు చివరి వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకుంటే మంచిది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Chief Secretary, Government of Telangana, General Administration, Burugula Rama Krishna Rao Bhavan, 9th floor, Adarsh Nagar, Hyderabad-500053,

Show Full Article
Print Article
Next Story
More Stories