పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court
x

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Highlights

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఉన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఈ ఏడాది మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ లో చేరారు.

ఈ ఏడాది ఏప్రిల్ 7న తెల్లం వెంకట్రావు, అంతకు ముందు నెల అంటే మార్చి 31న మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఈ ఏడాది జూన్ 21న మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి , జూన్ 24న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఏడాది మార్చి 17న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరికతో బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేల వలస ప్రారంభమైంది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వలస వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అయితే ఈ వలసలకు బ్రేక్ పడింది. ఈ బ్రేక్ తాత్కాలిక బ్రేక్ అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని స్పీకర్ కు వినతి పత్రం సమర్పించారు. అయితే ఈ పిటిషన్ పై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని... ఈ విషయమై స్పీకర్ కు ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును వెలువరించింది. నాలుగు వారాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకొని కేసు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories