TS High Court halts Old Secretariat Demolition: సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్..

TS High Court halts Old Secretariat Demolition: సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్..
x
TS High Court halts Old Secretariat Demolition Hyderabad
Highlights

TS High Court halts Old Secretariat Demolition: తెలంగాణ ప్రభుత్వం సచివాలయ భవనాల కూల్చివేత పనులను నిలిపి వేసింది. హైకోర్టు ఆదేశాలతో సచివాలయ భవనాల కూల్చివేతకు బ్రేక్ పడింది.

TS High Court halts Old Secretariat Demolition: తెలంగాణ ప్రభుత్వం సచివాలయ భవనాల కూల్చివేత పనులను నిలిపి వేసింది. హైకోర్టు ఆదేశాలతో సచివాలయ భవనాల కూల్చివేతకు బ్రేక్ పడింది. సోమవారం వరకు కూల్చివేత చేపట్టొద్దని హైకోర్టు అదేశించింది. దీంతో ఆ ప్రాంతంలో నిలిపి వేసిన ట్రాఫిక్ ప్రస్తుతం యధావిధిగా కొనసాగుతుంది. అయితే సచివాలయం నూతన నిర్మాణం పై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లో పిల్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. ఈ పిల్ ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధాఖలు చేసారు. అనంతరం ఆయన హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని కోరారు. దీంతో సుప్రీం కోర్టు పిటీషన్ పై విచారణను సోమవారం చేపట్టనున్నారు. ఇక పోతే గత వారం కోర్టు ఇచ్చిన ఆదేవాల మేరకు ఇప్పటికే సచివాలయ భవనాల కూల్చివేత 50 శాతం పూర్తిచేసారు.

ఇక పోతే తెలంగాణ పాత సచివాలయ భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం గత సోమవారం అర్థరాత్రి నుంచి సచివాలయం కూల్చివేత పనులను వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారులు గత సోమవారం అర్థరాత్రి నుంచే కూల్చివేతకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులను భారీగా మొహరించి ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్, మింట్ కాపౌండ్ సెక్రెటరేట్ దారులను మూసివేశారు. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సచివాలయం. నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సచివాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తరువాత తొలి పాలనా కేంద్రమైంది. మొత్తం 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా వెలసిల్లిన సచివాలయాన్ని నిజాంలు 25 ఎకరాల విస్తీర్ణంలో 10లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ కట్టడాన్ని నిర్మించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌ మాదిరిగా నిర్మించబడింది. నిజాంకు ఖాజానాగా ఉపయోగపడిన భవనాన్ని, ప్రస్తుతం సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 10 బ్లాకులుగా నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories