తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

TS HIGH COURT
x

తెలంగాణ హై కోర్ట్ ఫైల్ ఫోటో 

Highlights

*ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు *ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్ఎస్‌పై సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు..

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఆపథకాలకు సంబందించి ప్రజలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

ఇక ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతోందని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. అదేవిధంగా ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని ఏజీ వివరించారు. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైకోర్టుకు, పిటిషనర్లకు సమర్పించాలని ఈ సందర్భంగా హైకోర్టు సీజే ధర్మాసనం ఏజీని ఆదేశించింది.ఇక సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories