Telangana High Court Hearing : దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవి : హై కోర్టు

Telangana High Court Hearing : దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవి : హై కోర్టు
x
Highlights

Telangana High Court Hearing : తెలంగాణ సచివాలయం కూల్చివేత సమయంలో ఆ ప్రాంతంలోని ఆలయం, మసీదులు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం...

Telangana High Court Hearing : తెలంగాణ సచివాలయం కూల్చివేత సమయంలో ఆ ప్రాంతంలోని ఆలయం, మసీదులు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం దెబ్బతిన్న మసీదుని కూల్చివేసి పున:నిర్మాణం చేస్తామని తెలిపింది. కాగా సచివాలయంలోని మసీదు కూల్చివేతపై సయ్యద్ యాసన్, మహమ్మద్ ముజాఫరుల్ల, ఖాజా అజ్జాజుదీన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. మసీదును కూల్చివేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. సచివాలయంలో ఉన్న భూమి వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూమి అని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. 657 గజాలు ఉన్న మసీదును కూల్చివేసి 1500 చదరపు అడుగులు స్థలం కేటాయించడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మసీదును ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే నూతనంగా మసీదు నిర్మాణం చేపట్టాలని పిటీషనర్లు కోరారు. ప్రభుత్వ ఖర్చుతో నూతన మసీదును నిర్మిస్తామని చెప్పారు. సచివాలయం కూల్చివేతలో భాగంగా మసీదు కూడా కూలిపోయిందని ఏజీ హైకోర్టుకు తెలియజేశారు.

దీంతో హై కోర్టు బుధవారం రోజున ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. దేవుడికి ప్రార్థనలు గుడిలోనే చేసుకోవాలని ఎక్కడా లేదని, దేవుడు మనసులో ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు తెలిపింది. గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవని తెలిపింది. చట్ట ప్రకారం ప్రభుత్వాలు ఆ పని చేయవని తెలిపింది. ప్రజా అవసరాల కోసం మసీదులని కుల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మసీదు కూల్చితపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories