భర్త మృతి: ఎమ్మార్వో సుజాతకు బెయిల్‌

భర్త మృతి: ఎమ్మార్వో సుజాతకు బెయిల్‌
x
Highlights

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కోట్ల రూపాయాల విలువైన‌ భూ వివాదం కేసులో చిక్కుకుని.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరెస్టయిన షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కోట్ల రూపాయాల విలువైన‌ భూ వివాదం కేసులో చిక్కుకుని.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరెస్టయిన షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఎమ్మార్వో సుజాతకు రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. భర్త అజయ్ అంతక్రియల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ భూవివాదంలో లంచం తీసుకున్న కేసులో ఇరుక్కున్న సజాతను తెలంగాణ అవినితీ నిరోధక శాఖ (ఏసీబి) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గాంధీన‌గ‌ర్‌లో భ‌వ‌నంపైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు సుజాత భ‌ర్త అజ‌య్.

ఇటీవలే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయ‌గా ప‌లు సెక్ష‌న్ల కింద ఆమెపై కేసులు న‌మోదు చేశారు. అయితే, ఇదే కేసులో సుజాత భ‌ర్త అజ‌య్‌ను సైతం విచారించారు ఏసీబీ అధికారులు. ఓవైపు భార్య సుజాత అరెస్ట్ కావ‌డం, మ‌రోవైపు ప‌రువుపోయింద‌నే ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. సోదరి నివాసానికి వచ్చిన అజయ్‌ అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో పోలీసులు భ‌ర్త చ‌నిపోయ‌న విష‌యాన్ని సుజాత‌కు తెలియ‌చేశారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీం సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. సూసైడ్ చేసుకొనే ముందు..ఏదైనా లెట‌ర్ రాశాడా ? అనే దానిపై గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories