Formula E Race: కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు

Formula E Race: కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు
x

Formula E Race: కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు

Highlights

Formula E Race: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

Formula E Race: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలు వద్దని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేసింది.ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని హైకోర్టు తెలిపింది. చట్టప్రకారం నడుచుకోవాలని కోర్టు సూచించింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నారు.

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్మూలా ఈ కారు రేసు కేసులో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అసలు ఏం జరిగిందనే అంశాలను తెలుసుకునేందుకు ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు 2024 అక్టోబర్ 18న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ విచారించాలని ఏసీబీని కోరింది. కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2024 డిసెంబర్ 14న అనుమతి ఇచ్చారు.

ఈ అనుమతి దస్త్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏసీబీకి పంపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పంపిన అనుమతి పత్రం ఆధారంగా ఏసీబీ డీఏస్పీ మాజీద్ ఖాన్ 2024 డిసెంబర్ 19 కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3 గా హెచ్ఎండీఎల్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను ఏసీబీ చేర్చింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కూడా డిసెంబర్ 20, 2024 కేసు నమోదు చేసింది. తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories