Mohan Babu Bail Petition: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు నిరాశ

Telangana High Court Denies Interim Relief to Mohan Babu in Assault Case
x

Mohan Babu Bail Petition: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు నిరాశ

Highlights

మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ముందస్తు బెయిల్ పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలని చేసిన వినతిని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గురువారం తోసిపుచ్చింది.కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే తీర్పును వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఈ పిటిషన్ పై విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేసింది.

మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ముందస్తు బెయిల్ పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలని చేసిన వినతిని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గురువారం తోసిపుచ్చింది.కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే తీర్పును వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.ఈ పిటిషన్ పై విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేసింది.

డిసెంబర్ 10న మంచు మనోజ్ (Manchu Manoj) జల్ పల్లి మోహన్ బాబు ఇంటికి వచ్చిన సమయంలో గొడవ జరిగింది. ఈ సమయంలో మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లీగల్ ఓపినియన్ తీసుకొని ఆయనపై 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్(Anticipatory bail) కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో డిసెంబర్ 19న విచారణ జరిగింది.

డిసెంబర్ 10 గొడవపై రాచకొండ పోలీసులు (Rachakonda Police) ఇచ్చిన నోటీసులపై పోలీసుల ముందు హాజరయ్యేందుకు కోర్టు డిసెంబర్ 24 వరకు మోహన్ బాబుకు కోర్టు వెసులుబాటు ఇచ్చింది. మోహన్ బాబు వద్ద ఉన్న రెండు గన్స్ లలో ఒకటి చంద్రగిరి పోలీసులకు ఆయన అప్పగించారు. హైదరాబాద్ ఫిలింనగర్ పోలీసులు మరో గన్ ను సీజ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories